1392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ | @tspsc.gov.in లో దరఖాస్తు చేసుకోండి | TSPSC Junior Lecturer 2022

Hello ప్రియమైన Aspiranrants,

మీరు MA, M.Sc., లేదా M.Com. లేదా BA (Hons) లేదా B.Sc., (Hons) లేదా B.com (Hons) మొదలైన వాటిలో మీ పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? ప్రభుత్వ బోధన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త, తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ జూనియర్ లెక్చర్ల పోస్టులను భర్తీ చేయనుంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1392 జూనియర్ లెక్చర్ల (Junior Lecturer) పోస్టులను నియమించుకోబోతోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 27 కేటగిరీ సబ్జెక్టులను భర్తీ చేస్తుంది. సరైన అర్హత ఉన్న అభ్యర్థులు 16 డిసెంబర్ 2022 నుండి 6 జనవరి 2023 మధ్య పోస్టులకు దరఖాస్తు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ జూనియర్ లెక్చర్ (Junior Lecturer) 2022 రిక్రూట్‌మెంట్ యొక్క పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన ఆర్టికల్ చదవండి.

Telangana Junior Lecturer 2022 Exam In short:

 • నోటిఫికేషన్ విడుదల తేదీ: 9 డిసెంబర్ 2022
 • పోస్టు పేరు: జూనియర్ లెక్చరర్
 • మొత్తం ఖాళీలు: 1392
 • దరఖాస్తు రుసుము: ₹ 200/- నుండి ₹ 300/-
 • అభ్యర్థుల వయస్సు పరిమితి 18 నుండి 44 సంవత్సరాలు ఉండాలి
 • పరీక్ష విధానం: CBRT/OMR
 • ఆన్‌లైన్ పరీక్ష/ఆఫ్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది
 • దరఖాస్తు ప్రక్రియ 16 డిసెంబర్ 2022న ప్రారంభమవుతుంది
 • దరఖాస్తు ప్రక్రియ 6 జనవరి 2023న ముగుస్తుంది
 • TSPSC అధికారిక వెబ్‌సైట్

మరింత స్పష్టమైన సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లేదా దిగువ వ్రాసిన ఆర్టికల్ పూర్తిగా చదవండి. అభ్యర్థులు దిగువ ఇచ్చిన లింక్ ద్వారా జూనియర్ లెక్చరర్ 2022 అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSPSC Junior Lecturer 2022 Official Notification: Click Here

Table of Contents

ఎన్ని జూనియర్ లెక్చరర్ ఖాళీలను భర్తీ చేస్తారు?

ఈ నియామకం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మొత్తం 1392 పోస్టులకు భర్తీ చేస్తుంది . ఇక్కడ, మేము సబ్జెక్ట్ వారీగా ఖాళీల పూర్తి జాబితాను అందించాము, అభ్యర్థులు ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

 1. అరబిక్: 02
 2. వృక్షశాస్త్రం: 113
 3. వృక్షశాస్త్రం (ఉర్దూ మీడియం): 15
 4. రసాయన శాస్త్రం: 113
 5. కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం): 19
 6. పౌరశాస్త్రం: 56
 7. పౌరశాస్త్రం (ఉర్దూ మీడియం): 16
 8. పౌరశాస్త్రం (మరాఠీ మీడియం): 01
 9. వాణిజ్యం: 50
 10. వాణిజ్యం (ఉర్దూ మీడియం): 07
 11. ఆర్థికశాస్త్రం: 81
 12. ఆర్థిక శాస్త్రం (ఉర్దూ మీడియం): 15
 13. ఇంగ్లీష్: 153
 14. ఫ్రెంచ్: 02
 15. హిందీ: 117
 16. చరిత్ర: 77
 17. చరిత్ర (ఉర్దూ మీడియం): 17
 18. చరిత్ర (మరాఠీ మీడియం): 01
 19. గణితం: 154
 20. గణితం (ఉర్దూ మీడియం): 09
 21. భౌతికశాస్త్రం: 112
 22. ఫిజిక్స్ (ఉర్దూ మీడియం): 18
 23. సంస్కృతం: 10
 24. తెలుగు: 60
 25. ఉర్దూ: 28
 26. జంతుశాస్త్రం: 128
 27. జంతుశాస్త్రం (ఉర్దూ మీడియం): 18

TSPSC జూనియర్ లెక్చరర్ అర్హత ఏమిటి?

Answer:

జూనియర్ లెక్చరర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత ప్రమాణాలపై దృష్టి పెట్టాలి. అర్హత ప్రమాణాలు ప్రధానంగా క్రింది కారకాలను కలిగి ఉంటాయి:

 • జాతీయత
 • విద్య అర్హత
 • వయో పరిమితి

TSPSC జూనియర్ లెక్చరర్ విద్యా అర్హత ఏమిటి?

Answer:

1. Junior Lecturers in various subjects:

 • సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రావిన్షియల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ (Post Graduate Degree) అర్హత ఉండాలి. B.A. (Hons) or B.Sc., (Hons) or B.com (Hons) డిగ్రీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

2. Junior Lecturers in Civics:

 • పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం 50% మార్కులతో లేదా దానికి సమానమైన సెకండ్ క్లాస్ పీజీ డిగ్రీని కలిగి ఉండాలి.

గమనిక:

For Subjects in Urdu medium / Marathi Medium:

పదవ తరగతి స్థాయి (OR) వరకు ఉర్దూ / మరాఠీ మాధ్యమంలో చదివిన అభ్యర్థులు X తరగతి/SSC స్థాయిలో ఉర్దూ/మరాఠీని ప్రథమ భాషగా మరియు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉర్దూ/మరాఠీని ద్వితీయ భాషగా చదివిన అభ్యర్థులు, ఉర్దూ/మరాఠీ మీడియంలోని సబ్జెక్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

TSPSC జూనియర్ లెక్చరర్ వయో పరిమితి ఎంత ఉండాలి?

అభ్యర్థి వయస్సు తప్పనిసరిగా  18 నుండి 44  సంవత్సరాల మధ్య ఉండాలి అంటే అభ్యర్థి 01/07/2004 తర్వాత గాని మరియు 02/07/1978కి ముందు జన్మించి ఉండకూడదు.

వయస్సు సడలింపు అందుబాటులో ఉందా?

అవును, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అందుబాటులో ఉంది. ఇక్కడ దిగువన మేము గరిష్ట వయోపరిమితిలో సడలింపు యొక్క పూర్తి జాబితాను అందించాము.

 1. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు: రెగ్యులర్ సర్వీస్ వ్యవధి ఆధారంగా 5 సంవత్సరాలు
 2. మాజీ సైనికులు: 3 సంవత్సరాలు
 3. NCC: 3 సంవత్సరాలు
 4. SC/ST/BCలు & EWS: 5 సంవత్సరాలు
 5. శారీరక వికలాంగులు: 10 సంవత్సరాలు

జూనియర్ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ ఏమిటి?

ఎంపిక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు చాలా సందేహాలు ఉండవచ్చు అవి ఎంపిక ఎలా జరుగుతుంది? ఎన్ని దశలను క్లియర్ చేయాలి? అయితే అభ్యర్థులు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఇక్కడ మేము మీకు ఎంపిక ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాము. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల కొరకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది.

 1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)/ఆఫ్‌లైన్ OMR
 2. డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV)

జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించాలి అంటే అభ్యర్థి తప్పనిసరిగా కమిషన్ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించవల్సి ఉంటుంది. అభ్యర్థి ఎవరు అయితే కమిషన్ తెలిపిన అన్నీ దశలలో ఉత్తీర్ణత సాధిస్తారో వారు మాత్రమే మెరిట్ జాబితా ఆధారంగా ఉద్యోగం పొందుతారు.

జూనియర్ లెక్చరర్ పరీక్షా సరళి ఏమిటి?

TSPSC జూనియర్ లెక్చరర్ 2022 పరీక్ష విధానం క్రింది విధంగా ఉంది:

వ్రాత పరీక్ష

(ఆబ్జెక్టివ్ టైప్)

ప్రశ్నలు

వ్యవధి
(నిమిషాలు)

మార్కులు

పేపర్ - I

జనరల్ స్టడీస్ మరియు జనరల్
ఎబిలిటీస్

150

150

150

పేపర్ - II

సంబంధిత సబ్జెక్టు 

(PG స్థాయి)

150

150

300

మొత్తం మార్కులు

450

పేపర్ల పేరు

పరీక్షా భాష

పేపర్-I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

ద్విభాషా అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు

పేపర్-II: సంబంధిత సబ్జెక్టు (PG స్థాయి)

భాషలు మినహా అన్ని సబ్జెక్టులకు మాత్రమే ఇంగ్లీష్

గమనిక: భాషలు మినహా దిగువ పేర్కొన్న అన్ని ఇతర సంబంధిత సబ్జెక్టులు ఆంగ్లంలో మాత్రమే ఉంటాయి.

Sr.No.

సంబంధిత సబ్జెక్టులు

1

అరబిక్

2

వృక్షశాస్త్రం

3

రసాయన శాస్త్రం

4

పౌరశాస్త్రం

5

వాణిజ్యం

6

ఆర్థిక శాస్త్రం

7

ఇంగ్షీషు

8

ఫ్రెంచ్

9

హిందీ

10

చరిత్ర

11

గణితం

12

భౌతికశాస్త్రం

13

సంస్కృతం

14

తెలుగు

15

ఉర్దూ

16

జంతుశాస్త్రం

జూనియర్ లెక్చర్ క్వాలిఫైయింగ్ మార్కులు ఏమిటి?

ఉద్యోగం కోసం అభ్యర్థులు తప్పనిసరిగా కమిషన్ నిర్ణయించిన అర్హత మార్కులను సాధించవల్సి ఉంటుంది అయితే ఇక్కడ గుర్తించవకోవాలసిన విషయం ఏమిటి అంటే తుది ఎంపిక కోసం అర్హత మార్కులు పరిగణించబడవు అయితే మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇక్కడ, క్రింద మేము కేటగిరీ వారీగా కట్-ఆఫ్ మార్కులను అందించాము అభ్యర్థులు వాటివి చూడగలరు.

 • OC/మాజీ సైనికులు/క్రీడాకారులు & EWS అభ్యర్థులు 40% మార్కులు సాధించాలి
 • బీసీ అభ్యర్థులు 35% మార్కులు సాధించాలి
 • SC/ST/PH అభ్యర్థులు 30% మార్కులు సాధించాలి

జూనియర్ లెక్చరర్ జీతం ఎంత ఉంటుంది?

జూనియర్ లెక్చరర్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు జీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారు డ్యూటీలో చేరిన తర్వాత వారికి ఎంత జీతం ఇవ్వబడుతుందో తెలుసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ మేము ఎంపికైన అభ్యర్థులకు ఎంత మొత్తం జీతంగా ఇస్తారో తెలియజేస్తాము. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్  కింద నెలకు రూ. 54,220 నుండి రూ. 1,33,630/- (తెలంగాణ రాష్ట్ర సంబంధిత అలవెన్సులను కలుపుకొని) ఇస్తారు.

TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ ఏమిటి?

అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ జూన్/జూలై 2023 నెలలో నిర్వహించబడుతుంది. అయితే, అప్పటి వరకు, అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి లేదా TS JL 2022 పరీక్ష సంబంధిత అప్‌డేట్‌ల కోసం మాయొక్క website కూడా చూడవచ్చు. మరిన్ని ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం మాయొక్క website కూడా చూడండి.

TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షకు 7 రోజుల ముందు జూనియర్ లెక్చరర్ హాల్ టిక్కెట్‌లను విడుదల చేస్తుంది. అభ్యర్థులు కింద తెలిపిన కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Step-by-step guide:

 • ముందుగా అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
 • అప్పుడు, “Junior Lecturer Hall Tickets” లింక్‌పై క్లిక్ చేయండి
 • తరువాత, అడిగిన విధంగా వివరాలను పూరించండి
 • ఆ తర్వాత , “Submit” బటన్‌పై క్లిక్ చేయండి
 • చివరగా, Hall Ticket డౌన్‌లోడ్ చేయండి

లేదా అభ్యర్థులు నేరుగా క్రింది లింక్‌ ద్వారా కూడా జూనియర్ లెక్చరర్ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSPSC Junior Lecturer Hall Tickets 2022: Click Here

TSPSC జూనియర్ లెక్చరర్ ఫలితాలను ఎలా తెలుసుకోవాలి చేయాలి?

పరీక్ష ముగిసిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) జూనియర్ లెక్చరర్ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. అయితే మేము తెలిపిన విధానాన్ని అనుసరిస్తే అభ్యర్థులు సులభంగా తెలంగాణ జూనియర్ లెక్చరర్ 2022 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Step-by-step guide:

 • ముందుగా, TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
 • అప్పుడు, “Junior Lecturer Result 2022 ” లింక్‌పై క్లిక్ చేయండి
 • తరువాత, PDF లిస్ట్ డౌన్‌లోడ్ చేయండి
 • ఆ తర్వాత, మీ Roll number లేదా hall ticket numberతో వెతకండి
 • చివరగా, మీ ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి

లేదా అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్ నుండి నేరుగా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSPSC Junior Lecturer Results 2022: Click Here

జూనియర్ లెక్చరర్ అప్లికేషన్ ఫీజు ఎంత?

1 . సాధారణ అభ్యర్థులు:

 • దరఖాస్తు రుసుము: ₹ 200/-
 • పరీక్ష రుసుము: ₹ 120/-
 • మొత్తం: ₹ 320/-

2. SC/ST/PH/BC/ESM/నిరుద్యోగ యువత:

 • దరఖాస్తు రుసుము: ₹ 200/-
 • పరీక్ష రుసుము: లేదు
 • మొత్తం: ₹ 200/-

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా సమర్పించాలి?

జూనియర్ లెక్చరర్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కూడిన ఆన్‌లైన్ ఫారమ్‌ను తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తించుకోవాలసిన అంశం ఏమిటి అంటే ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడుతాయి అని గుర్తుంచుకోవాలి. మేము ఆన్‌లైన్ దరఖాస్తును ఎలా పూరించాలో దశల వారీ ప్రక్రియను వివరించడం జరిగినది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత సరిచూసుకోవాలి.

Step-by-step guide:

 • ముందుగా, TSPSC అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి
 • ఆపై, హోమ్‌పేజీలో, “One-Time Registration” పై క్లిక్ చేయండి
 • తర్వాత, మీ అన్ని వ్యక్తిగత వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
 • ఆ తర్వాత , “Submit” పై క్లిక్ చేయండి
 • చివరగా, ఏదైనా డెబిట్/క్రెడిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా పరీక్ష రుసుమును చెల్లించండి మరియు భవిష్యత్తు సూచన కోసం కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకొని జాగ్రతగా పెట్టుకోండి.

The Direct way to Apply Online

అర్హత కలిగిన అభ్యర్థులు TSPSC జూనియర్ లెక్చరర్ 2022 పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో 16 డిసెంబర్ 4 2022 నుండి 6 జనవరి 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు లేదా దిగువ అందించిన లింక్ నుండి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Apply Online for TSPSC Junior Lecturer 2022: Click Here

FAQs

What is the eligibility for a junior lecturer in Telangana?

Candidates must have passed Post Graduation with second class or equivalent qualification with 50% marks.

What is the last date to apply for Telangana JL Notification?

Last date to apply for Telangana JL is 06-01-2023.

2 thoughts on “1392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ | @tspsc.gov.in లో దరఖాస్తు చేసుకోండి | TSPSC Junior Lecturer 2022”

  • For the Zoology post, you must possess a Post graduate degree (M.Sc.) or B.Sc., (Hons) in Zoology. But if you want to apply with an Ecology degree as an equivalent degree, you can contact the Commission for clarification before applying.

   Reply

Leave a Comment